Current Date Example

Follow Us

ఫాస్టాగ్‌ కొత్త రూల్స్‌ వచ్చేశాయ్.. ఇవి పాటించకుంటే షాక్ లే మరి.... - DEO Prakasam

ఫాస్టాగ్‌ కొత్త రూల్స్‌ వచ్చేశాయ్.. ఇవి పాటించకుంటే షాక్ లే మరి….

By DEO Prakasam

Published on:

Follow Us

ఫాస్టాగ్‌ కొత్త రూల్స్‌ వచ్చేశాయ్.. ఈరోజే చెక్‌ చేసుకోండి… నేటి (ఫిబ్రవరి 17, 2025) నుంచి కొత్త ఫాస్టాగ్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. తేడా వస్తే ఫైన్…

దేశంలో ఫాస్టాగ్ వినియోగదారులకు (New FASTag Rules) కీలక అలర్ట్ వచ్చేసింది. ఈరోజు (ఫిబ్రవరి 17, 2025) నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. వీటి గురించి తెలుసుకోకుంటే మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే ఆ నిబంధనలు ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం. కొత్త రూల్స్ ప్రకారం టోల్ చెల్లింపుల్లో వ్యవధిని తగ్గించడంతోపాటు వాహనాల రవాణా, భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా పలు నియమాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపొందించింది. ఈ క్రమంలో FASTagను సమర్థవంతంగా ఉపయోగించడం, సమయానుకూలంగా టోల్ చెల్లింపులు చేసే అవకాశం ఉంది.

మీFASTag రీఛార్జ్ చేయడం మర్చిపోయారా? ఫాస్టాగ్‌ అకౌంట్‌ సమస్యను పరిష్కరించుకోలేదా? అయితే వెంటనే సరి చేసుకోండి. లేదంటే భారీ జరిమానా కట్టాల్సి వస్తుంది.

ఫాస్టాగ్‌ లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) రేపటి నుంచి కొత్త నిబంధనలను తీసుకొస్తోంది. బ్లాక్‌ లిస్టులో ఉన్న ఫాస్టాగ్‌ యూజర్లు టోల్‌ ప్లాజాకు వచ్చే 70 నిమిషాల్లోపు ఆ లిస్టు నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. లేని పక్షంలో రెండింతల ఛార్జి చెల్లించాల్సి వస్తుంది. 

మినిమం బ్యాలెన్స్‌

ఈ కొత్త రూల్స్ ప్రకారం FASTagలో మినిమం రూ. 100 బ్యాలెన్స్ కంటే తక్కువ ఉన్న వినియోగదారులు చెల్లింపు చేయడంలో ఆలస్యం లేదా FASTag బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నవారు అదనపు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఈ మార్పులు టోల్ ప్లాజాలలో వాహనాల క్యూలను తగ్గించేందుకు, ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేసేందుకు రూపొందించబడ్డాయి. కాబట్టి మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలి.

కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఫాస్ట్ ట్యాగ్ నియమాలు ఫాస్ట్ ట్యాగ్ చెల్లింపులని ఆలస్యం చేసే లేదా బ్లాక్ లిస్ట్ చేసిన ఫాస్ట్ ట్యాగ్ లని వినియోగించే వారిపై ప్రభావం చూపనుంది.

ఎక్కువ సమయం

దీంతోపాటు వాహనదారుడు టోల్ గేట్ ప్రాంతానికి వచ్చి FASTag 60 నిమిషాలకంటే ఎక్కువ సమయం ఉంటే, టోల్ దాటిన 10 నిమిషాల తర్వాత ఆ లావాదేవీ తిరస్కరించబడుతుంది. అంటే టోల్ చెల్లింపు జరగదని “ఎర్రర్ కోడ్ 176” చూపిస్తుంది. దీంతో టోల్ ప్లాజాలో ఆ చెల్లింపు జరగదు. మీరు చార్జ్ చేసినప్పటికీ, ట్యాగ్ స్కాన్ చేసిన 10 నిమిషాలలోపు ఖాతాను రీఛార్జ్ చేస్తే, మీరు జరిమానాను తిరిగి పొందుతారు. అయితే టోల్ రీడర్ గుండా వాహనం వెళ్ళిన 15 నిమిషాల తర్వాత, చెల్లింపు ప్రాసెస్ చేయబడితే, వినియోగదారులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.

ఫిబ్రవరి 17 నుంచి కారు లేదా ఏదైనా వాహనం టోల్ గేట్ క్రాస్ చేయడానికి 60 నిమిషాల కంటే ఎక్కువ సమయం పాటు ఫాస్ట్ ట్యాగ్ ఇన్ యాక్టీవ్ గా ఉండి, టోల్ గేట్ దాటిన తరువాత 10 నిమిషాల వరకు ఇన్ యాక్టీవ్ గా ఉంటే, అటువంటి లావాదేవీ తిరస్కరించబడుతుంది.

  • తక్కువ బ్యాలెన్స్, బ్లాక్ లిస్ట్ వంటి కారణాలతో FASTag చెల్లింపు జరగకపోతే, మీకు టోల్ ప్లాజాలో మీ స్థితిని సరిదిద్దుకోవడానికి 70 నిమిషాల సమయం లభిస్తుంది.
  • బ్లాక్‌లిస్ట్ లేదా తక్కువ బ్యాలెన్స్ ఉన్న FASTags 15 రోజుల వ్యవధి పూర్తైన తర్వాత మాత్రమే ఛార్జ్‌బ్యాక్ చేసుకోవాలి. 15 రోజుల ముందు చేసిన ఛార్జ్‌బ్యాక్ అభ్యర్థనలు తిరస్కరించబడతాయి. ఇటువంటి లావాదేవీలని సిస్టమ్ ‘error code 176’ కింద తిరస్కరిస్తుంది.
  •  ఈ కొత్త ఫాస్ట్ ట్యాగ్ నియమాలు అనేవి ఛార్జ్ బ్యాక్ ప్రాసెస్, కూలింగ్ పీరియడ్ పరంగా కూడా మార్పులని కలిగి ఉంటాయి.
  • బ్లాక్‌లిస్ట్ FASTag ఉన్న వినియోగదారులు బూత్‌కు చేరుకున్న తర్వాత వసూలు చేసిన టోల్‌ను రెట్టింపు చేస్తారు. అయితే, బ్లాక్‌లిస్టింగ్ గురించి తెలిసిన వినియోగదారులు 10 నిమిషాల్లోపు రీఛార్జ్ పొందితే, డబ్బును తిరిగి పొందవచ్చు.
  • టోల్ లావాదేవీలు అనేవి వాహనం టోల్ రీడర్ ని దాటిన సమయం నుంచి 15 నిమిషాలకి మించి ప్రాసెస్ చేయబడితే అప్పుడు ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులపై అదనపు ఛార్జీలు విధించే అవకాశం ఉంటుంది.
  • ఈ కొత్త మార్పుల నేపథ్యంలో వినియోగదారులు ఎప్పటికప్పూడూ తమ FASTag ఖాతాను నిరంతరం తనిఖీ చేసుకోవాలి. టోల్ ప్లాజా వద్ద తక్కువ బ్యాలెన్స్, బ్లాక్‌లిస్ట్ పరిస్థితులు ఏర్పడకుండా చూసుకోవాలి. నిబంధనలను అర్థం చేసుకోవడం ద్వారా మీరు అదనపు జరిమానాలు, ఇతర ఛార్జీలు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
  • ఒకవేళ టోల్ లావాదేవీ ఆలస్యం అయినా, అలాగే ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారుని ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ లో తగినంత బ్యాలన్స్ లేకపోయినా టోల్ ఆపరేటర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ కొత్త మార్గదర్శకాలు తెలియచేస్తున్నాయి.

    అమల్లోకి వచ్చిన ఫాస్టాగ్ కొత్త రూల్స్-తేడా వస్తే షాకులే..!

 

Leave a Comment