విజ్ఞాన విహార యాత్రలకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు..వీరే…
Government school students for science excursions..
ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్ధుల్లో నైపుణ్యాభివృద్ధి, మనోవికాసం, శాస్త్రసాంకేతిక రంగాలపై ఆసక్తి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఏపీతోపాటు, రాష్టేతర ప్రాంతాలకు విజ్ఞాన, విహార యాత్రలకు విద్యార్థులను తీసుకువెళ్లాలని నిర్ణయించింది.
రాష్ట్ర వ్యాప్తంగా 7,781 మంది విద్యార్థులను తీసుకువెళ్లనున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రం పరిధిలో ఒక్కో విద్యార్ధికి రూ.200 చొప్పున, ఇతర రాష్ట్రాలు వెళ్లేవారికి రూ.2 వేలు చొప్పున ఖర్చు చేయనున్నారు.
ఇందుకు గాను నిధుల కేటాయింపు, విద్యార్థులు, ఎస్కార్టు ఉపాధ్యాయుల ఎంపిక తదితర అంశాలపై సమగ్ర శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.