నందమూరి బాలకృష్ణ కు పద్మభూషణ్ అవార్డు ఆనందంలో నందమూరి అభిమానులు…
సీనియర్ సినీ నటులు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు శనివారం ప్రకటించింది కలల విభాగంలో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలకృష్ణ అభిమానులు సినీ ప్రముఖులు నందమూరి అభిమానులు ఆనందంలో అభినందనలు తెలిపారు.
బాలకృష్ణను పద్మభూషన్ వరించటం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని బాలయ్య నివాసానికి స్వయంగా వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారని.. క్యాన్సర్ ఆసుపత్రికి ఛైర్మన్‌గా ఉంటూ.. నిరుపేదలకు సహాయం చేస్తున్నారని కొనియాడారు. మరోవైపు.. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవ చేస్తున్నారని.. తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆయన చేస్తున్న సేవలను గుర్తించి పద్మభూషణ్ ప్రకటించడం సంతోషకరమని కిషన్ రెడ్డి అభిప్రాయడ్డారు.
మరోవైపు.. బాలకృష్ణ కూడా మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉంటూ సమాజానికి స్పూర్తిదాయక సినిమాలు తీస్తున్నానని.. బాలకృష్ణ చెప్పుకొచ్చారు. 15 ఏళ్లుగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ప్రజాప్రతినిధిగా చేస్తున్న నిస్వార్థ సేవలను భారత ప్రభుత్వం గుర్తించినందుకు బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు. పద్మభూషణ్ రావడం చాలా సంతోకరంగా ఉందని తెలిపారు. ఈ పురస్కారాన్ని విలువగా కంటే కూడా ఒక బాధ్యతగా భావిస్తానని తెలిపారు. మళ్లీ వెన్నుతట్టి.. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు ఉత్సాహ పరిచారన్నారు. ఈ సందర్భంగా.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని బాలకృష్ణ తెలిపారు.